వనస్థలిపురం వివాహిత మృతి కేసులో కొత్త ట్విస్ట్

వనస్థలిపురం వివాహిత మృతి కేసులో కొత్త ట్విస్ట్

హైదరాబాద్: వనస్థలిపురంలోని, వైదేహీనగర్ లో దారుణం జరిగింది. ఈనెల 18న రమావత్ కవిత అనే వివాహిత అనుమానాస్పదంగా చనిపోయింది. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పిల్లిగుంట్ల తండాకు చెందిన రామావత్ కవిత భర్తతో కలిసి సుందరయ్య కాలనీలో ఉంటున్నారు. కవితకు కరోనా లక్షణాలు ఉండటంతో ఈ నెల 10న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చిందని విజయ్ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. వారం రోజుల తర్వాత కవిత చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. వనస్థలిపురం వచ్చిన కవిత కుటుంబసభ్యులు డెడ్ బాడీని సొంతూరుకి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. 

తర్వాత కుటుంబసభ్యులంతా కరోనా టెస్ట్ చేయించుకోగా అందరికి నెగటివ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కవిత తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఓ మహిళ విషయంలో గతంలో కూతురు, అల్లుడి మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లిగుంట్ల తండాకు వెళ్లి తహశీల్దార్ సమక్షంలో పూడ్చిపెట్టిన కవిత డెడ్ బాడీని తీసి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే కవితది హత్యా..లేక ఆత్మహత్య అనేది క్లారిటీ వస్తుందంటున్నారు పోలీసులు. తమ కూతురును ఆమె భర్తే హత్య చేసి కరోనాతో చనిపోయినట్లు క్రియేట్ చేశాడని కవిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.