సీక్రెట్ గా వాట్సాప్ గ్రూపునుంచి ఎగ్జిట్... !

సీక్రెట్ గా వాట్సాప్ గ్రూపునుంచి ఎగ్జిట్... !
  • వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
  • వాట్సాప్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయినా మిగతా యూజర్స్ కు నో అప్ డేట్

రోజురోజుకూ టెక్నాలజీ విస్తరిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే దానివల్ల ఇబ్బందులు సైతం పెరుగుతూ వస్తున్నాయి. రోజుకో కొత్త ఫీచర్, నిమిషానికో అప్ డేట్ వస్తూండడం పరాపాటిగా మారిపోయింది. అందులో ఒకటి వాట్సాప్. ఇప్పటివరకూ వాట్సాప్ మేసేంజర్ ఎన్నో అప్ డేట్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో మార్పులు చేర్పులతో యూజర్స్ సంతృప్తిగా ఉన్నా, కొన్ని  అప్ డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల నిరాశకు గురవుతున్నారు. అలాంటి వాటిల్లో ఈ మధ్య కాలంలో చాలా మందికి చిరాకు పుట్టించే అంశం ఏమిటంటే మనం ఏదైనా వాట్సాప్ గ్రూపు నుంచి నిష్క్రమించినప్పుడు అందులో ఉన్న మెంబర్స్ అందరికీ అలర్ట్ వెళ్లడం. దాని వల్ల మనం ఎప్పుడు ఆ గ్రూపు నుంచి బయటికి వచ్చేసినా అందరికీ తెలిసిపోతుంది. 

ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. అదేంటంటే మనం ఏదైనా వాట్సాప్ గ్రూపులో మెంబర్ గా ఉండి, ఏదైనా కారణం చేత ఆ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయితే ఆ అలర్ట్ అందులోని సభ్యులందరికీ కాకుండా, కేవలం అడ్మిన్ కి మాత్రమే వెళ్లేటట్టు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. అంతే కాదు మనం ఆ గ్రూపు నుంచి నిష్క్రమించినపుడు అది మిగతా యూజర్స్ కు ఎలా తమ చాట్ బాక్స్ లో ఎలా కనిపిస్తుందో కూడా స్ర్కీన్ షాట్ ద్వారా వెల్లడించడం మరో గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రూపు మెసేజులను, అప్ డేట్ ల ను దూరం పెట్టడానికి  ఓ తెలివైన పద్ధతిగా గోచరిస్తోంది. WABetaInfo ప్రకారం ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.