సిడ్నీ: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన న్యూజిలాండ్.. టీ20 వరల్డ్‌కప్‌ను గ్రాండ్ విక్టరీతో షురూ చేసింది. ఓపెనర్ డేవన్ కాన్వే (58 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 నాటౌట్) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన సూపర్–12 తొలి మ్యాచ్‌లో కివీస్ 89 రన్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దీంతో 11 ఏళ్ల తర్వాత ఆసీస్‌లో కంగారూలపై కివీస్ తొలి విక్టరీ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 200/3 స్కోరు చేసింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ మొదలుపెట్టిన ఫిన్ అలెన్ (16 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42), కాన్వే.. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. తర్వాత వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (23), గ్లెన్ ఫిలిప్స్ (12) ఫెయిలైనా.. కాన్వే మాత్రం చెలరేగిపోయాడు. 36 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివర్లో జేమ్స్ నీషమ్ (13 బాల్స్‌లో 2 సిక్సర్లతో 26 నాటౌట్) సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, జంపా ఒక వికెట్ తీశారు.
క్యూ కట్టారు..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 111 రన్స్‌కు ఆలౌటైంది. మ్యాక్స్‌వెల్ (28) టాప్ స్కోరర్. కివీస్ పేసర్లు సౌథీ (3/6), శాంట్నర్ (3/31) దెబ్బకు.. కంగారూలు ఏ దశలోనూ టార్గెట్‌ను అందుకోలేకపోయారు. వార్నర్ (5), ఫించ్ (13), మార్ష్ (16), స్టోయినిస్ (7), టిమ్ డేవిడ్ (11), వేడ్ (2) బ్యాట్లెత్తేశారు. చివర్లో కమిన్స్ (21) పోరాటం చేసినా మిగతా వాళ్ల సపోర్ట్ లేకపోవడంతో ఆసీస్‌కు భారీ ఓటమి తప్పలేదు. కాన్వేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
