
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సబ్ స్టేషన్ లోని లైన్స్ క్లబ్ హాస్పిటల్ లో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో హాస్పిటల్ లో చేరిన భార్గవి అనే మహిళకు నర్సులు ఆపరేషన్ చేశారు. అయితే బిడ్డ మృతి చెందింది. పురుటి నొప్పులు తీవ్రంగా రావడం..డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతోనే నర్సులు ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
కోటి హోం కిట్‌లు సిద్ధం
ఎమ్మార్వో ఆఫీసులో పాము కలకలం