కొత్త ఫీచర్స్​తో సరికొత్త మొబైల్స్

కొత్త ఫీచర్స్​తో  సరికొత్త మొబైల్స్

రియల్‌‌మి సీ21వై
మీడియం, బడ్జెట్‌‌ రేంజ్‌‌ స్మార్ట్‌‌ఫోన్స్‌‌తో ఆకట్టుకుంటున్న రియల్‌‌మి నుంచి రానున్న మరో బడ్జెట్‌‌ రేంజ్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ ఇది. ఈనెలలోనే రిలీజ్‌‌ అవుతుంది.
6.5 అంగుళాల డిస్‌‌ప్లే
ఆండ్రాయిడ్‌‌ 11 (గో ఎడిషన్‌‌)
యునిసాక్‌‌ టీ610 చిప్‌‌సెట్‌‌
4జీబీ/64జీబీ
ట్రిపుల్‌‌రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (13ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ
10 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌
ధర: సుమారు రూ. 8,499

ఎమ్‌‌ఐ 11 లైట్‌‌
షావోమీ కంపెనీ నుంచి ఎమ్‌‌ఐ బ్రాండ్‌‌లో ఈనెల 22న మార్కెట్లోకి రానున్న మీడియం రేంజ్ ఫోన్‌‌ ఇది. 
6.5 అంగుళాల హెచ్‌‌డి డిస్‌‌ప్లే
స్నాప్‌‌డ్రాగన్‌‌ 732జి ప్రాసెసర్‌‌‌‌
6జీబీ/64జీబీ, 8జీబీ/28జీబీ
ఆండ్రాయిడ్‌‌ 11 ఓఎస్‌‌
ట్రిపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (64ఎంపీ+8ఎంపీ+5ఎంపీ)
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4250 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ
22 వాట్స్‌‌ ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌
ధర: సుమారు రూ. 24,499

ఐక్యూ  జడ్‌‌3 5జీ
ఐక్యూ బ్రాండ్‌‌ నుంచి లేటెస్ట్‌‌గా మార్కెట్లోకి వచ్చిన 5జీ స్మార్ట్‌‌ ఐక్యూ జడ్‌‌3. స్నాప్‌‌డ్రాగన్‌‌ ప్రాసెసర్‌‌‌‌, ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌ ఫీచర్స్‌‌ ప్రధాన ఆకర్షణ.
6.5 అంగుళాల డిస్‌‌ప్లే
స్నాప్‌‌డ్రాగన్‌‌ 768జి ప్రాసెసర్‌‌‌‌
ఆండ్రాయిడ్‌‌ 11 ఓఎస్‌‌
6జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ
ట్రిపుల్‌‌ రేర్‌‌‌‌ కెమెరాస్‌‌ (64 ఎంపీ+2ఎంపీ+8ఎంపీ)
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,400 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ, 55 వాట్స్‌‌ ఫాస్ట్ చార్జింగ్‌‌
ధర: సుమారు రూ. 19,990/ రూ. 22,990
కలర్స్‌‌: ఏస్‌‌ బ్లాక్‌‌,  సిల్వర్‌‌‌‌, సైబర్‌‌‌‌ బ్లూ

రియల్‌మి సీ25ఎస్‌
రియల్‌మి నుంచి లేటెస్ట్‌ లాంఛ్‌ అయిన మరో బడ్జెట్‌ ఫోన్‌ ‘రియల్‌మి సీ 25ఎస్‌’. వాటరీ గ్రే, వాటరీ బ్లూ కలర్స్​లో లాంఛ్‌ అయింది.
6.5 అంగుళాల తెర
మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌‌
ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌
4జీబీ/64జీబీ, 4జీబీ/128జీబీ
ట్రిపుల్‌ రేర్‌‌ కెమెరాస్ (13ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
8ఎంపీ సెల్ఫీ కెమెరా
6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌
ధర: సుమారు రూ. 9,999/రూ. 10,999

కాయ్‌‌ ఓఎస్‌‌పై వాట్సాప్‌‌ వాయిస్‌‌ కాల్స్‌‌
స్మార్ట్‌‌ ఫీచర్‌‌‌‌ ఫోన్స్ నడిచేది కాయ్‌‌ ఓఎస్‌‌పై. అటు పూర్తిగా ఫీచర్‌‌‌‌ ఫోన్స్ కాకుండా, ఇటు స్మార్ట్‌‌ఫోన్స్‌‌ కాకుండా ఉండే ఫోన్లలో ఉండేది కాయ్‌‌ ఓఎస్‌‌. ఇప్పుడు ఈ ఫోన్స్‌‌పై వాట్సాప్‌‌ వాయిస్‌‌ కాలింగ్‌‌ ఫీచర్‌‌‌‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కాయ్‌‌ ఓఎస్‌‌ ఫోన్స్‌‌పై వాట్సాప్‌‌ పనిచేస్తున్నా, వాయిస్‌‌ కాలింగ్‌‌ ఫీచర్‌‌‌‌ లేదు. ఇప్పుడు ఈ ఫీచర్‌‌‌‌ను మనదేశంతోపాటు అనేక దేశాల్లో లాంఛ్‌‌ చేస్తున్నట్లు వాట్సాప్‌‌ అనౌన్స్‌‌ చేసింది. ఈ ఫీచర్‌‌‌‌ కోసం ఫోన్​లో 512 ఎంబీ లేదా అంతకంటే ఎక్కువ ర్యామ్‌‌ ఉండాలి. మొబైల్‌‌ డేటా లేదా వై–ఫై.. ఏ నెట్‌‌వర్క్‌‌ ద్వారా అయినా వాట్సాప్‌‌ వాయిస్‌‌ కాల్స్‌‌ చేసుకోవచ్చు. 

ఐఓఎస్‌‌ 15 ఫీచర్స్‌‌ ఇవే!
షేర్‌‌‌‌ ప్లే:
యాపిల్‌‌ డివైజెస్‌‌లో వీడియో–ఆడియో కాలింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌ ‘ఫేస్‌‌ టైమ్‌‌’ గురించి తెలిసిందే. ఇప్పుడు దీనికి తోడుగా కొత్త ఓఎస్‌‌లో షేర్ ప్లే అనే ఫీచర్‌‌‌‌ రాబోతుంది. ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా వీడియో లేదా ఆడియో ఫైల్‌‌ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌కు షేర్ చేయొచ్చు. ఈ ఫైల్‌‌ను అందరూ కలిసి ‘ఫేస్‌‌టైమ్ కాల్‌‌’ ద్వారా ఒకేసారి యాక్సెస్‌‌ చేయొచ్చు. ఈ ఫైల్‌‌ ‘పిక్చర్‌‌‌‌–ఇన్‌‌–పిక్చర్‌‌‌‌’ విండోలో ప్లే అవుతుంది. యాపిల్‌‌ టీవీకి కాస్ట్‌‌ కూడా చేసుకోవచ్చు.
నోటిఫికేషన్‌‌ సమ్మరీ: ఇది మొబైల్‌‌ డివైజెస్‌‌పై మాత్రమే పనిచేసే ఫీచర్‌‌‌‌. యూజర్స్‌‌ నోటిఫికేష న్స్‌‌ను కస్టమైజ్‌‌ చేసుకోవచ్చు. సెలక్ట్‌‌ చేసుకున్న ఇంపార్టెంట్‌‌ నోటిఫికేషన్స్‌‌ టాప్‌‌లో ఉండేలా ఈ ఫీచర్‌‌‌‌ పనిచేస్తుంది. అన్ని నోటిఫికేషన్స్‌‌కు సంబంధించిన సమ్మరీని కూడా అందిస్తుంది.
స్పాట్‌‌లైట్‌‌: ఇప్పటికే ఉన్న స్పాట్‌‌లైట్‌‌ ఫీచర్‌‌‌‌ను మరింతగా డెవలప్‌‌ చేసింది యాపిల్‌‌. స్పాట్‌‌టైల్‌‌ యూనివర్సల్‌‌ సెర్చ్‌‌లో ఫొటోలు కూడా వెతకొచ్చు. లొకేషన్‌‌, పీపుల్‌‌, సీన్‌‌, ఆబ్జెక్ట్స్‌‌ను బట్టి కూడా ఫొటోలు వెతికే వీలుంది. యాక్టర్స్‌‌, మ్యుజీషియన్స్‌‌, మూవీస్‌‌, టీవీ షోస్‌‌కు సంబంధించి స్పెషల్‌‌ కార్డ్స్‌‌ను అందిస్తుంది.
యాపిల్‌‌ మ్యాప్స్: యాపిల్‌‌ మ్యాప్స్‌‌ యాప్‌‌లో కూడా మరిన్ని ఫీచర్స్ యాడ్‌‌ చేసింది. కొత్త అప్‌‌డేట్‌‌ ద్వారా త్రీ డైమెన్షనల్‌‌ సిటీ డ్రైవింగ్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందివ్వనుంది. రోడ్స్‌‌కు సంబంధించిన వివరాల్ని కూడా వివరంగా అందిస్తుంది. టర్న్‌‌ లేన్స్‌‌, బైక్‌‌ లేన్స్‌‌, పెడస్ట్రియన్‌‌ క్రాస్‌‌వాక్స్‌‌ వంటి వివరాలు ఇంకా బాగా కనిపిస్తాయి.
విజువల్‌‌ లాకప్‌‌: గూగుల్‌‌ లెన్స్‌‌కు డబ్డ్‌‌ వెర్షన్‌‌ ఇది. ఫొటోలపై కనిపించే టెక్స్ట్‌‌, ఫోన్‌‌ నెంబర్స్‌‌ను ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా డైరెక్ట్‌‌గా తెలుసుకోవచ్చు. కెమెరాను ఏదైనా ఫొటోపై ఫోకస్‌‌ అయ్యేలా చేసి, ఆ ఫొటోపై ఉన్న టెక్స్ట్‌‌ను కాపీ చేసుకోవచ్చు. తర్వాత ఏ యాప్‌‌లోనైనా పేస్ట్‌‌ చేసుకోవచ్చు. ఫొటోల ద్వారా వాటికి సంబంధించిన వివరాల్ని తెలుసుకోవచ్చు.