రూ.16 వేల భారీ డిస్కౌంట్తో కొత్త ఐఫోన్..జనం ఎగబడి కొంటున్నారు

రూ.16 వేల భారీ డిస్కౌంట్తో కొత్త ఐఫోన్..జనం ఎగబడి కొంటున్నారు

మీరు కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. డిస్కౌంట్లు , ఆఫర్ల లో ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నారా.. అయితే ఆ అవకాశం రానే వచ్చింది. కంపెనీ తాజా ఐఫోన్ పై రూ. 16 వేల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇది Filipkart  లో అందుబాటులో ఉంది. iPhone 15 ని ఫ్లిఫ్ కార్ట్ లో రూ. 79,900కి ఒరిజినల్ ఉండగా.. రూ. 66,499 కే అందిస్తోంది. అంటే కస్టమర్లకు దానిపై రూ .9,901 తగ్గింపుతో అమ్మకాలు చేపట్టారు. బ్యాంకు ఆఫర్ తో మరో 3,325 తగ్గింపు కూడా ఇస్తోంది. దీంతో iPhone 15 డిస్కౌంట్ తర్వాత ధర రూ. 63,174. ఈ ఐఫోన్ పై ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఎక్ఛేంచ్ కింద 50వేల తగ్గంపు పొందవచ్చు. 

ఇక iPhone  ఫీచర్ల గురించి చెప్పుకన్నట్లయితే.. ఈ ఫోన్ 6.1 అంగుళాల OLED సూపర్ రెటినా XDR డిస్ ప్లేను, 200 nits, 2556x1179 పిక్సెల్ ల బ్రైట నెస్ ను కలిగి ఉంటుంది. ఇందులో A16 బయోనిక్ 4nmప్రాసెసర్ కూడా ఉంది. కస్టమర్లు ఫోన్ లో 128 GB/256GB/512GB ఇంటర్నల్ మెమోరీని పొందొచ్చు. 

Also read : హ్యాపీ మొబైల్స్​లో రియల్​మీ ఫోన్లు

కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనక వైపు 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఫ్రండ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ iOS17 తో రన్ అవుతుంది. 

ఇక ఈ ఐఫోన్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ ,పింక్, పసుపు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వస్తుంది. దుమ్మ, వాటర్ ఫ్రూఫ్ తో వస్తోంది. కనెక్టివిటీ కోసం ఇది Wi-Fi , బ్లూటూత్ 5.3, అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్, రీడర్ మోడ్ తో NFC ,గ్లోనాస్ తో GPS కలిగి ఉంటుంది.