వాషింగ్టన్: అమెరికా డెమొక్రాటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కమలా హ్యారిస్ అక్టోబర్ 20న 56వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జో బిడెన్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. నెక్స్ట్ పుట్టిన రోజును వైట్ హౌస్‌లో జరుపుకుందామని అన్నారు. ‘హ్యాపీ బర్త్‌డే కమలా హ్యారిస్. వచ్చే సంవత్సరం మీ పుట్టినరోజును మనం వైట్‌హౌస్‌లో ఐస్‌క్రీమ్‌తో వేడుకగా జరుపుకుందాం’ అని ట్వీట్ చేశారు. బిడెన్, కమల చేతులు కలిపిన ఫోటోను ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్‌కు స్పందించిన కమలా హ్యారిస్.. బిడెన్‌కు థ్యాంక్స్ తెలిపారు. వచ్చే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, అదే తనకు బర్త్‌డే విష్ అని ఆమె అన్నారు. కమలకు మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్, మిచెల్ ఒబామా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల్లో కమల గెలిస్తే అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. కాగా, బిడెన్ వచ్చే నెలలో తన 78వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు.
