NHRC: షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కు ఆహ్వానం..విజేతకు రెండు లక్షలు..చివరి తేదీ ఇదే

NHRC: షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కు ఆహ్వానం..విజేతకు రెండు లక్షలు..చివరి తేదీ ఇదే

'ఒక్క అవకాశం'.. గెలుపుతో విజేతలను చేస్తోంది. ఆ ఒక్క అవకాశం ఓటమితో జీవితాన్ని నేర్పిస్తుంది. ఇపుడు అలాంటి అవకాశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ –2024ని ప్రకటించింది.

ఆసక్తి ఉన్నవారు మానవ హక్కులపై తమదైన శైలిలో షార్ట్ ఫిల్మ్స్ తీసి తమకు పంపగలరని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. ఈ మేరకు 2024 ఆగస్టు 30 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమని తెలిపింది.

NHRC 10వ వార్షిక సందర్బంగా ఈ పోటీలకు ఔత్సహికులను   ఆహ్వానిస్తుంది. ఈ పోటీలో పాల్గొని మొదటి ఉత్తమ చిత్రానికి రూ.2 లక్షలు, ద్వితీయ చిత్రానికి రూ.1.5 లక్షలు కాగా తృతీయ చిత్రానికి ఒక లక్ష రూపాయల చొప్పున NHRC ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం http://nhrc.nic.in ఈ సైట్ ను సందర్శించండి. ఆలస్యం ఎందుకు..మీ కథలకు దృశ్య రూపాన్ని ఇవ్వండి..విజేతలు అవ్వండి.