నాగర్ కర్నూల్ ఎస్పీకి ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్సీ నోటీసులు

నాగర్ కర్నూల్ ఎస్పీకి ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: నాగర్ కర్నూల్ ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఏబీవీపీ నేత హరి ప్రసాద్‌‌‌‌‌‌‌‌ను వెల్దండ సీఐ ఉద్దేశపూర్వకంగా అవమానించారని, శారీరకంగా వేధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు అడ్వకేట్ జగన్ ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. పెద్దపూర్ గ్రామంలో ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో సీఐ ఇష్టానుసారంగా వ్యవహరించారని చెబుతూ దానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు, పేపర్ క్లిప్పింగులను జత చేశారు. జగన్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్సీ నాగర్ కర్నూల్ ఎస్పీకి నోటీసులిచ్చింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.