ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు

ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు

పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపెట్టింది. పీఎఫ్ఐ సంస్థ పేరుతో అబ్దుల్ ఖాదర్ అండ్ టీమ్ ఉగ్రచర్యలకు కుట్ర చేశారని.. ఫిజికల్ టెస్టుల పేరుతో ఒకవర్గాన్ని టార్గెట్ చేసి కత్తులతో, ఐరన్ రాడ్లతో  దాడిచేసేలా శిక్షణ ఇచ్చారని పేర్కొంది. పీఎఫ్ఐ క్యాడర్ పేరుతో అబ్దుల్ ఖాదర్ అండ్ టీమ్ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. ఉగ్రకుట్ర వైపు ట్రైన్ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ స్పష్టం చేసింది.

ఉద్వేగపూరిత స్పీచులు, వీడియోలు చూపిస్తూ ఒకవర్గంపై కక్ష పెరిగేలా ఉసిగొల్పుతున్నారని రిపోర్టులో పేర్కొంది. న్యాయవ్యవస్థపైనా కుట్రకు ప్లాన్ చేశారని తెలిపింది. విచారణలో అబ్దుల్ ఖాదర్ కుట్రను అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టు అధికారులు పేర్కొన్నారు.