NIACL లో అసిస్టెంట్ ఉద్యోగాలు.. జీతం రూ. 62 వేలు..

NIACL లో అసిస్టెంట్ ఉద్యోగాలు.. జీతం రూ. 62 వేలు..

అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 అసిస్టెంట్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అసిస్టెంట్  పోస్టులను భర్తీ చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 1, 2024 న ప్రారంభించింది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్  http://www.newindia.co.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 300 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • దరఖాస్తు ప్రక్రియ : ఆన్ లైన్ 
  • లాస్ట్ డేట్ :  2024 ఫిబ్రవరి15.
  • వయస్సు : 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
  •  టైర్ 1 ఆన్ లైన్ పరీక్ష  లేదా  ప్రిలిమినరీ పరీక్ష తేది : మార్చి 2 

అర్హతలు : ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఎస్ఎస్సీ/ హెచ్ఎస్సీ/ ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలి. 2024 జనవరి 1 వ తేదీ నాటికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. 

ఎంపిక విధానం: ఎంపిక విధానంలో ఆన్ లైన్ టెస్ట్ లు (ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్) ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను తుది ఎంపికకు ముందు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కు షార్ట్ లిస్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు : ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 850 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్ / మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/ మొబైల్ వ్యాలెట్లను ఉపయోగించి అప్లికేషన్ ఫీజును చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు NIACL అధికారిక వెబ్సైట్ newindia.co.in ను చూడవచ్చు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ :https://www.newindia.co.in/assets/docs/recruitment/RECRUITMENT-OF-ADMINISTRATIVE-OFFICERS2023/DETAILED%20ENGLISH%20ADVERTISEMENT%20-%20ASSISTANT%20RECRUITMENT%202023.pdf