డ్రగ్స్ అమ్ముతూ దొరికిన సింగం మూవీ ఫేమ్ మాల్విన్‌

V6 Velugu Posted on Sep 30, 2021

బెంగళూరు: ప్రముఖ హీరో సూర్య సింగం సినిమాలో విలన్‌ పక్కన నటించిన నైజీరియన్ నటుడు చెక్వుమే మాల్విన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కేసులో భాగంగా బెంగళూరు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మాల్విన్ నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్​ ఆయిల్ ​సహా 15 గ్రాముల ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌‌డౌన్ టైంలో మూవీ చాన్సులు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తున్నాడని సమాచారం.  

ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్‌‌ను చెక్వుమే మాల్విన్ విక్రయించేవాడని సమాచారం. మాల్విన్‌కు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఎన్నేళ్ల నుంచి అతడు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు? ఇందులో సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. కాగా, మాల్విన్ కన్నడతోపాటు పలు హిందీ, తమిళ సినిమాల్లో నటించాడు. తమిళంలో సింగం, విశ్వరూపం.. హిందీలో దిల్‌వాలే, జంబూ సవారీ, పరమాత్మ చిత్రాల్లో మాల్విన్ నటించాడు. అతడిపై పలు నార్కోటిక్ డ్రగ్స్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. బూతులు తిడుతూ రెచ్చిపోయిన దుండగులు

వాగులో కొట్టుకుపోతున్న వాహనదారుడ్ని కాపాడిన కానిస్టేబుల్

నెట్​ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్లు

చెబితే వింటది..చెప్పింది చేస్తది

Tagged Arrested, Bengaluru, Nigerian Actor, Drugs Peddling, Actor Chekwume Malvin 

Latest Videos

Subscribe Now

More News