Niharika : విడాకుల కోసం నిహారిక దరఖాస్తు..

Niharika : విడాకుల కోసం నిహారిక దరఖాస్తు..

మెగా ఫ్యాన్స్ కలత చెందే వార్త. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక విడాకుల కోసం దరఖాస్తు చేస్తుకున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సంబంధించిన దరఖాస్తును దాఖలు చేశారు.  అప్పటి గుంటూరు ఐజీ కుమారుడు చైతన్యతో 2020లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. వివాహం జరిగి రెండేళ్లు మాత్రమే అయ్యింది. ఇంతలోనే చైతన్యతో తెగదెంపులు చేసుకుంటుంది నీహారిక

కొన్ని రోజులుగా నిహారిక విడాకుల వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందుకు బలాన్ని ఇస్తూ.. ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లోనూ నాగబాబు అల్లుడు, నిహారిక భర్త చైతన్య కనిపించలేదు. కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కు కూడా హాజరుకావటం లేదు. అప్పటి నుంచి ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం జరిగినా.. అధికారికంగా ఎక్కడా.. ఎవరూ స్పందించలేదు.

ఈ క్రమంలోనే.. జులై 4వ తేదీన.. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక విడాకుల దరఖాస్తు బయటకు రావటం సంచలనంగా మారింది. ఆ దరఖాస్తుతో.. వీళ్లిద్దరూ త్వరలోనే అధికారికంగా వేరు కానున్నారు. కొన్ని నెలల క్రితమే నిహారిక తన ఇన్ స్టా నుంచి పెళ్లి ఫొటోలు, వీడియోలు తొలగించటమే కాకుండా.. తన పేరుతో నిహారిక చైతన్య నుంచి.. నిహారిక కొణిదెలగా మార్చింది. అప్పటి నుంచే విడాకులు ఖాయం అని ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లటంతో.. ఈ వార్త నిజం అయ్యింది.

ప్రస్తుతం నాగబాబు ఇంట్లో నిహారిక అన్నయ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే.. చెల్లికి విడాకుల వార్త మెగా ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేస్తుంది.