చరణ్, నిఖిల్ కాంబోలో భారీ ప్రాజెక్ట్.. ది ఇండియా హౌస్

చరణ్, నిఖిల్ కాంబోలో భారీ ప్రాజెక్ట్.. ది ఇండియా హౌస్

వీ మెగా పిక్చర్స్ బ్యానర్ లో మొదటి సినిమా చేసే అవకాశం కొట్టేసాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగా అనౌన్స్మెంట్స్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు. 

ఈ వీడియో చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. 1900 దశకంలో  భారతదేశ చరిత్ర పుటల్లో లేని ఒక అధ్యాయాన్ని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. సాలిడ్ కంటెంట్  తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు “ది ఇండియా హౌస్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 

కార్తికేయ 2 తరువాత నిఖిల్ రేంజ్ పాన్ నార్త్ లో కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. రామ్ వంశీ కృష్ణ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.