- కవితకు నిరంజన్ రెడ్డి కౌంటర్
వనపర్తి, వెలుగు: ఒక్క ఇంచు భూమి ఆక్రమించినట్టు ఆధారాలున్నా బయటపెట్టాలని, తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బీఆర్ఎస్ లీడర్ నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆమె ఎట్ల మాట్లాడినా కేసీఆర్ కూతురు అనే కారణంతో అందరూ ఊరుకుంటున్నారని.. కానీ తనపై దాదాగిరి టైపులో మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోమవారం వనపర్తిలో మీడియాతో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా కవిత కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ‘‘నీళ్ల నిరంజన్‌రెడ్డి అన్న పేరు నేను పెట్టుకున్నది కాదు.. ప్రజలే ఇచ్చారు. మీకంతా ఇబ్బందిగా ఉంటే ఆ టైటిల్‌ను పేపరు మీద రాసి వెనక్కి ఇచ్చేస్తా. లిక్కర్రాణి అనే టైటిల్‌తో మీరే సంతోషంగా ఉండండి” అని ఎద్దేవా చేశారు. ‘‘మేం తండాలకు వెళ్లినప్పుడు.. ‘కేసీఆర్కూతురు సారాయి అమ్మితే తప్పులేదు గానీ.. మేం అమ్మితే తప్పా?’ అని లంబాడీ బిడ్డలు ప్రశ్నించారు.
అప్పుడు మేం ఎంతో బాధపడ్డాం” అని చెప్పారు. ‘‘అసలు కేసీఆర్మానసిక క్షోభకు కారణం నువ్వే (కవిత). అయినా మేం సైలెంట్‌గా ఉన్నాం. నువ్వు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో.. నాపై చేసిన వ్యాఖ్యలను విరమించుకో” అని కవితకు సూచించారు.
