
నిర్మల్, వెలుగు: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులకు కోర్టు ఆవరణలో పారిశుధ్య పనులు చేయాలని శిక్ష విధిస్తూ మంగళవారం నిర్మల్ స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.నరసయ్య తీర్పునిచ్చారు. లైజన్ఆఫీసర్కొమ్ము రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చించోలి పార్క్ వద్ద ముగ్గురు యువకులు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే సమాచారంతో షీ టీమ్అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంది.
ముధోల్ మండలం మచకల్ గ్రామానికి చెందిన గంగులవార్ నరేశ్, బోథ్మండలం కుచలాపూర్ గ్రామానికి చెందిన గూడెం తరుణ్ కుమార్, కుబీర్ మండలం వాయులింగి గ్రామానికి చెందిన బొద్దుల సాయికుమార్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులు తప్పు చేసినట్లు రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ఆవరణలో పారిశుధ్య పనులు చేయాలని తీర్పునిచ్చారు.