రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు.. కుభీర్ వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు.. కుభీర్ వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
  • ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 

కుభీర్, వెలుగు: మాశ్చర్ ​పేరుతో శనగ రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5875 మద్దతు ధరను చెల్లిస్తుందన్నారు.

అంతకుముందు రూ. కోటి 70 లక్షలతో రాజుర వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. సర్పంచ్ కందూర్ సాయినాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణ్, ఆత్మ చైర్మన్ వివేకానంద, పీఏసీఎస్​కార్యదర్శి క్రాంతికుమార్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.