రైల్వే లైన్కు అనుమతులివ్వండి..కేంద్ర మంత్రిని కోరిన మహేశ్వర్ రెడ్డి

రైల్వే లైన్కు  అనుమతులివ్వండి..కేంద్ర మంత్రిని కోరిన మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: అదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​కు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందంతో కలిసి మహేశ్వర్ రెడ్డి రైల్వే మంత్రిని కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ ప్రాంత ప్రజలు రైల్వే సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రైల్వే లైన్ నిర్మిస్తే ఉత్తర తెలంగాణలోని వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులు, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. రైల్వే లైన్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవా లని కోరారు.