నిర్మల్, వెలుగు: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ అనే ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించే పోస్టర్‌ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చిన అటాచ్మెంట్లను తెరవవద్దన్నారు. డిజిటల్ అరెస్ట్, బెదిరింపుల గురించి భయపడవద్దన్నారు. సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా 1930కు అలాగే tgcs b.p olice.gov.in వెబ్‌సైట్‌లోని చాట్‌బాట్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్చార్జ్ వెంకట రమణ, ఆర్ఎస్సై శ్రావ ణి, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
