తెలంగాణ అప్పులను వెల్లడించిన కేంద్రం

తెలంగాణ అప్పులను వెల్లడించిన కేంద్రం

తెలంగాణ అప్పులను కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా  కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్  తెలుగు రాష్ట్రాల అప్పలను ప్రకటించారు.  2023 రాష్ట్ర బడ్జెట్ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.3లక్షల66 వేల 306 కోట్లుగా ఉందని చెప్పారు.

  • 2019 మార్చి నాటికి తెలంగాణ అప్పు రూ. 1,90,203 లక్షల కోట్లు
  • 2020 మార్చి నాటికి రూ.2,25,418 లక్షల కోట్లు
  • 2021 నాటికి రూ.2,71,259 లక్షల కోట్లు
  • 2022 నాటికిరూ.3,14,136 లక్షల కోట్లు
  • 2023 మార్చి నాటికి రూ. 3,66,306 లక్షల కోట్లు

అంతేగాకుండా తెలంగాణ గవర్నమెంట్ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కింద రూ.1407 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కింద రూ. 6528 కోట్లు అప్పు తీసుకుందని వెల్లడించారు.  2023 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు అని తెలిపారు.