నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. హీరో నానికి చెందిన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆఫియా సయ్యద్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కృష్ణ అనే రైటర్‌గా నితిన్ లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్.. శనివారం మరో లుక్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో రుక్మిణి తన ప్రపంచంలోకి రాకముందు కృష్ణ లుక్‌తో పాటు తన జీవితం ఎలా ఉండేదనేది చూపించారు. ఇందులో క్లాస్ రూమ్ బెంచ్‌పై కూర్చుని కాలేజ్ స్టూడెంట్‌గా నూనూగు మీసాలతో నితిన్ యంగ్‌గా కనిపించాడు. నితిన్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఈ వీడియో గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
