Nithin Thammudu: తమ్ముడు టైటిల్తో నితిన్ సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్

Nithin Thammudu: తమ్ముడు టైటిల్తో నితిన్ సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్

యూత్ స్టార్ నితిన్(Nithin) హీరోగా, వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్(Venu Sriram) ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి లయ(Laya) నితిన్ అక్కగా కీ రోల్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకు తమ్ముడు(Thammudu) టైటిల్ ఫిక్స్ చేయనుంరని వార్తలు వైరల్ అయ్యాయి. ఫైనల్ గా అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.

మార్చి 30 నితిన్ పుట్టినరోజు సందర్బంగా తమ్ముడు టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో నితిన్ లారీపై కుమార స్వామి ఆయుధాన్ని పట్టుకొని ఉండగా.. ఆడవాళ్లు లారీ తోలుతూ కనిపించారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో నితిన్ ఆర్చరీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో, ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా కోసం నితిన్ అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

మరి చాలా కాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాతో అయినా హిట్టు కొడతాడని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నితిన్ తమ్ముడు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా.. కాంతార, మంగళవారం ఫేమ్ అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.