నితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు

నితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు

మహారాష్ట్ర : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం నాగ్పూర్ లోని కార్యాలయానికి రెండు సార్లు ఫోన్ చేసిన ఆగంతకులు బాంబు ఉన్నట్లు చెప్పారు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి బాంబు దొరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఉదయం 11: 30 గంటలు, 11:40గంటల సమయంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.