మల్లికార్జున్ ఖర్గే, జైరామ్ రమేష్ కు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు

 మల్లికార్జున్ ఖర్గే, జైరామ్ రమేష్ కు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు

తనపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వీడియో క్లిపింగ్ ద్వారా తనపై సోషల్ మీడియాలో తప్పడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ జయరామ్ రమేష్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈరోజు గ్రామాలల్లో కూలీలు,  రైతులు సంతోషంగా లేరు. గ్రామాలకు రోడ్లు, తాగునీరు, మంచి ఆసుపత్రులు, పాఠశాలలు లేవని నితిన్ గడ్కరీ అన్నట్లు ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ క్రమంలో గడ్కరీ న్యాయవాది బాలెందు శేఖర్ మాట్లాడుతూ.. ఓ ఛానల్ కు నితీన్ ఇచ్చిన ఇంటర్వ్యూను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ వక్రీకరించి,  సందర్భానుసారంగా అర్థం లేని వీడియోను అప్‌లోడ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.   గడ్కరీ ఇంటర్వ్యూకు సంబంధించిన 19 సెకన్ల వీడియో క్లిప్‌ను.. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించినట్లుగా ఆయన మాటలను క్రియేట్ చేశారని తెలిపారు.  ఆ వీడియో క్లిప్ ను కాంగ్రెస్ నాయకులు ఖర్గే, జయరామ్ లు సామాజిక మాధ్యామాల్లో షేర్ చేసి... నితిష్ పై తప్పుడు ప్రచార చేస్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. నితన్ పరువుకు నష్టం కలిగించేలా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఆయనపై తప్పుడు ప్రచారం ఆపి.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు నితిష్ తరుపు లాయర్ చెప్పారు.

also read : మీకో దండం.. మీ రాజకీయాలకో దండం : బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన ప్రకటన

 రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ జనతా పార్టీలో చీలికలు సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు వార్తలను కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.