ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్

ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఏడో సారి ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా ఏడో సారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. బీహార్ గవర్నర్ ఆయన చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇదే సమయంలో బీజేపీకి చెందిన తార్ కిషోర్ ప్రసాద్, రేణుదేవిలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. నితీశ్ తో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ నేతలెవరూ హాజరుకాలేదు. 20 ఏళ్లలో ఏడు సార్లు సీఎంగా బాధ్యతలను స్వీకరించిన నితీశ్ కుమార్ కు దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

బీహార్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టా తీసుకున్న నితీష్..ఆ తర్వాత రాష్ట్ర విద్యుత్ బోర్డులో కొంత కాలం పాటు ఉద్యోగం చేశారు. అయితే రాజకీయలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీఇచ్చారు. మొదట రెండు సార్లు ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు. 1985 లో జరిగిన ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టారు నితీష్ కుమార్.