45 సీట్లు కూడా గెలవని వ్యక్తికి సీఎం పీఠమా?

45 సీట్లు కూడా గెలవని వ్యక్తికి సీఎం పీఠమా?

పాట్నా: బిహార్‌‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తర్వలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం పదవితోపాటు మంత్రి పదవుల కేటాయింపులపై కూటమి నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ మరోమారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయమే. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ మీద రాష్ట్రీయ జనతా దళ్ సీనియర్ నేత మనోజ్ ఝా కామెంట్ చేశారు.

‘రాష్ట్ర (బిహార్) శాసనసభలో నితీశ్ కుమార్ 45 సీట్లు కూడా గెల్చుకోలేకపోయారు. నితీశ్ చాలా తక్కువ మెజారిటీలో ఉన్నారు. అది కూడా మేనేజ్ చేయగలిగే మెజారిటీనే. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు. మీరు ప్రజల ఆదేశాన్ని అణచివేశారు. కానీ బిహార్ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు. వాళ్లు మిమ్మల్ని విడిచిపెట్టరు. జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తారు. 45 సీట్లు కూడా గెలవని వ్యక్తి సీఎం పీఠంపై కూర్చుంటారా? మొత్తం స్క్రిప్ట్‌‌ను బీజేపీ నడిపిస్తోంది. పరిస్థితిని బీజేపీ కంట్రోల్ చేస్తోంది’ అని ఝా పేర్కొన్నారు.