రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేయండి

రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేయండి

బిజినెస్ మెన్స్ కు బిహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి
పాట్నా: బిహార్ లో చాలా మార్కెట్ ఉందని, అక్కడ కొత్త యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కోరారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. బిహార్ కు లక్షలాది వలస కూలీలు తిరిగి రావడంపై నితీశ్ స్పందించారు. ‘మాది వినియోగిత రాష్ట్రం. మాకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన బిజినెస్ మెన్స్ దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వాళ్లు బిహార్ లో కొత్త ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలి. వారికి కావాల్సిన సాయాన్ని స్టేట్ గవర్నమెంట్ అందిస్తుంది. ఎవరైతే రాష్ట్రంలోనే బిజెనెస్ చేయాలనుకుంటున్నారో వారికీ సర్కార్ తోడుగా ఉంటుంది. ఇక్కడి ప్రజలకు స్టేట్ లోనే వర్క్ కల్పించాలనేది మా కోరిక. దీని వల్ల పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే అవసరం ఉండదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా అరేంజ్ మెంట్స్ చేస్తున్నాం. బిహార్ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం అవుతారు’ అని నితీశ్ పేర్కొన్నారు. టెక్స్ టైల్స్, షూ, బ్యాగ్, ఫర్నీచర్, సైకిల్ ఇండస్ట్రీల్లో బిహార్ కు ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బిహార్ కు వెలుపల ఉన్న ప్రైవేటు కంపెనీలు తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీల బాగోగుల గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదన్నారు. మైగ్రంట్ వర్కర్స్ ను చూసుకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీలదేనని నితీశ్ స్పష్టం చేశారు.