మాతాశిశు మరణాలపై లోతుగా విచారణ : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

మాతాశిశు మరణాలపై లోతుగా విచారణ : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​లో మాతాశిశు మరణాల ఉదంతాలపై లోతుగా విచారణ జరుపుతామని, డాక్టర్లు నిర్లక్ష్యం చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్​లో నిర్వహించిన మాతాశిశు మరణాల నిరోధక కమిటీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

 మూడు నెలలుగా జిల్లాలో నమోదైన మాతాశిశు మరణాల కేసులను తెలుసుకున్నారు. మహిళలు గర్భం దాల్చాక క్రమంగా వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు చేయాలన్నారు. స్కానింగ్​ సెంటర్లను రెగ్యులర్​గా తనిఖీ చేయాలని, లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించే సెంటర్లను సీజ్​ చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్​వో డాక్టర్​ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్​వో రవీందర్​, ప్రోగ్రామ్​ ఆఫీసర్​ డాక్టర్​ శ్వేత, బుస్స ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

పోలింగ్​ కేంద్రాల తనిఖీ..

ఎడపల్లి/నవీపేట్​, వెలుగు: ఎడపల్లి మండలం జానకంపేట, నవీపేట్ మండలంలోని అభంగపట్నంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రాలను కలెక్టర్​ వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని, ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఎన్నిక నిర్వహించాలని సూచించారు.