
- నాలుగేండ్ల బాలుడి పరిస్థితి విషమం
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌లోని గాయత్రీనగర్‌లో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించినవారిని కరవడంతో పది మంది గాయపడ్డారు. ఇందులో నాలుగేండ్ల పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది. గాయత్రీనగర్‌లో ఉదయం 8 గంటలకు గేట్ బయటకు వచ్చిన సృజన్‌పై కుక్క దాడి చేసింది. అతడి చెవి వెనుక భాగాన్ని చీల్చేసింది.
గమనించిన చుట్టుపక్కల వాళ్లు దాన్ని తరమడానికి ప్రయత్నించగా స్రవంతి, శ్రీకాంత్‌లను కొరికింది. ఇదే క్రమంలో మరో ఏడుగురిపై కూడా దాడి చేసి గాయపరిచింది. బాధితులు గవర్నమెంట్హాస్పిటల్లో ట్రీట్మెంట్తీసుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు సృజన్‌ను అతడి తల్లిదండ్రులు హైదరాబాద్ తరలించారు.