నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్,  వెలుగు: ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యనారాయణ అన్నారు. గురువారం ఇందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని తేనె సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రైల్వే స్టేషన్ వద్ద నిరాశ్రయులకు దుప్పట్లు, జీజీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పండ్ల పంపిణీ చేశారు. ఎంపీ క్యాంప్​ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు స్నేహ సొసైటీలో దివ్యాంగ విద్యార్థులకు అన్నదానం చేశారు. అనంతరం ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. సేవా కార్యక్రమాలతో  పేదలకు పెద్దదిక్కుగా నిలుస్తున్నాడని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్  లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, పంచరెడ్డి ప్రవల్లిక, ఆకుల హేమలతా శ్రీనివాస్, ఇల్లేందుల ప్రభాకర్, సందగిరి రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బంటు రాము,  ఇప్పకాయల కిశోర్, పుట్ట వీరేందర్, దాత్రిక రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆశిష్, విజయ్, పవన్, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ పాల్గొన్నారు. 

పలు చోట్ల సేవా కార్యక్రమాలు..

బోధనలో నాయకులు మేడపాటి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వడ్డి మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బోధన్​టౌన్ ప్రెసిడెంట్​ కొలిపాక బాల్​రాజు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పండ్లు పంపిణీ చేశారు. డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని మానవత సదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బర్త్​డే కేక్​కట్ చేశారు. నందిపేటలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కిసాన్​మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. నవీపేట్ భక్త మార్కండేయ ఆలయంలో పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేశారు. 

హుస్సాముద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సన్మానం

నిజామాబాద్ టౌన్, వెలుగు: ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన  సుబేదార్ హుస్సాముద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నిజమాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సత్కరించారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరిన్ని పతకాలు సాధించి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి  పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో లింగంపేట ముందంజ

లింగంపేట, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో కామారెడ్డి జిల్లాలోనే లింగంపేట సొసైటీ మొదటి స్థానంలో నిలిచిందని సింగిల్​విండో చైర్మన్ కూచన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విండో పరిధిలో 25 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2,272 మంది రైతుల నుంచి 1,36,789 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు విరించారు. విండో పరిధిలో 297 మంది రైతులు రూ.13 కోట్ల దీర్ఘ కాలిక రుణాలు ఇవ్వగా రూ.3.75 కోట్లను రికవరీ చేశామన్నారు. ప్రస్తుతం వన్​టైంసెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​పథకం అమలులో ఉన్నందున రైతులు రుణాలను చెల్లించి సొసైటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తనపై కొంతమంది విండో డైరెక్టర్లు బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విండో సీఈవో సందీప్, డైరెక్టర్లు సాయాగౌడ్, పూల్య నాయక్, సురేందర్, సత్యం పాల్గొన్నారు. ​

యాత్ర ముగింపు సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి

కామారెడ్డి, వెలుగు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 27న హన్మకొండలో  నిర్వహించే బహిరంగ సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో  లీడర్లు, కార్యకర్తలు తరలి వెళ్లాలన్నారు. గురువారం  జిల్లా కేంద్రం లీడర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. సభకు వెళ్లేందుకు నియోజకవర్గంలోని ప్రతి ఊరి నుంచి ఒక వెహికల్​ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో  టౌన్​ ప్రెసిడెంట్​విపుల్ జైన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, లీడర్లు పాల్గొన్నారు. అనంతరం ట్రీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐటీకి సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన బీబీపేట మండలం మాందాపూర్ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 19 మంది స్టూడెంట్లను  వెంకటరమణారెడ్డి సన్మానించారు. 

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలం బోర్లంలో గురువారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. దళితవాడలో రూ. 5 లక్షలతో నిర్మించే ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్,  రూ. 7.50 లక్షలతో నిర్మించే ఎస్సీ కమ్యునిటీ హాల్, రూ. 9 లక్షలతో నిర్మించే అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ భవనాలకు స్పీకర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో శీను పేర్కొన్నారు. గురువారం తన ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్సవాల నిర్వహణపై ఆయా శాఖల ఆఫీసన్లు,  ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ఆయా శాఖల ఆఫీసర్లు తమకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తహసీల్దార్​ ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, మున్సిపల్ కమిషనర్ దెవేందర్, ప్రతినిధులు ముప్పారపు ఆనంద్, గెరిగంటి లక్ష్మీనారాయణ, చింతల రమశ్, పిల్లి మల్లేశ్ పాల్గొన్నారు. 

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌‌‌‌లో ఎల్లారెడ్డి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిభ

ఎల్లారెడ్డి, వెలుగు: అథ్లెటిక్స్‌‌‌‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ టౌన్ ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎల్లారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్ హరిత సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. అండర్ 18 విభాగం 1500 మీటర్ల పరుగు పందెంలో 2వ స్థానం సాధించినట్లు చెప్పారు. హరిత ప్రస్తుతం ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతున్నట్లు తెలిపారు. హరితను ప్రిన్సిపాల్, టీచర్లు అభినందించారు.

కేంద్ర సహాయ మంత్రిని బర్తరఫ్ చేయాలి

ఆర్మూర్, వెలుగు: రైతులను కుక్కలతో పోల్చిన కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాని బర్తరఫ్ చేయాలని ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు డిమాండ్​ చేశారు. గురువారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జేఏసీ రైతు ప్రతినిధులు బి.దేవారం, లింగారెడ్డి మాట్లాడుతూ రైతు చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంపై ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజయ్ మిశ్రా భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో మంథని పిట్ట గంగారాం, రామకృష్ణ, సరా సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేశ్వర్, బాబన్న పాల్గొన్నారు.

జాడి జామాల్​పూర్ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలన

బోధన్, వెలుగు: భారీ వర్షాలతో మండలంలోని జాడిజామాల్​పూర్ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టును ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్ఈ బద్రినారాయణ  గురువారం పరిశీలించారు. కొత్త లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ వీరాస్వామి, ఐడీసీ ఈఈ భీమానాయక్, ఏఈ శ్రీనివాస్, రైతు బంధు మాజీ మండల  కోఆర్డినేటర్​బుద్దె రాజేశ్వర్, మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ నర్సయ్య ఉన్నారు.  

పండుగలను ప్రశాంతంగా జరుపుకుందాం

ఆర్మూర్, వెలుగు: రానున్న గణేష్ నవరాత్రి, దుర్గామాత ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందామని ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తీర్మానించారు. పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఐ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, ఎస్సైలు శ్రీకాంత్, ప్రదీప్, ఎంపీపీ పస్కా నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్, డీఈ శ్రీధర్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేక్ మున్నూ, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పూజ నరేందర్ మాట్లాడారు.  

రెండు స్కూళ్ల దత్తత

నిజామాబాద్, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్టిన రోజు సందర్భంగా మాక్లూర్ మండలం కల్లెడ, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాల్లోని గర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లను దత్తత తీసుకున్నట్లు ఎం క్లౌడ్ టెక్నాలజీస్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టోన్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్ సంస్థల ప్రతినిధులు సుధీర్ రెడ్డి,  ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గౌతమ్ గురువారం ప్రకటించారు. గతంలో కూడా అర్వింద్ అభ్యర్ధన మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బులిటీ కింద అజిలిజ్ అనే సంస్థ కుకునూర్, మోతె గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కల్లెడ, పిప్రి గ్రామాలను దత్తత తీసుకున్న సంస్థలు కూడా ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలల అభివృద్ధి కృషి చేయనున్నాయి.  

జీవో 69 ఉపసంహరించుకోవాలి

ధర్పల్లి/పిట్లం, వెలుగు: వడ్రంగి వృత్తికి ఆంక్షలు పెడుతున్న అటవీ శాఖ జీవో 69ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విశ్వబ్రహ్మణ సంఘం స భ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వడ్లూరి రమేశ్, రాము, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.  పిట్లంలో కూడా విశ్వబ్రహ్మణులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ వడ్ల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు పాల్గొన్నారు.

హైవే వెంట పచ్చదనాన్ని పెంచాలి

నిజామాబాద్ టౌన్, వెలుగు:  జిల్లా నుంచి వెళ్తున్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 44కు రెండు వైపులా పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దు ప్రాంతం చంద్రాయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి నుంచి డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వరకు హైవే కు ఇరువైపుల నాటిన మొక్కలను గురువారం పరిశీలించారు. రహదారి పొడుగునా ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా  మొక్కలు నాటాలని చెప్పారు.  ట్రీగార్డులు, కర్రలను సరి చేసుకుంటూ, దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్తగా ఎతైనా మొక్కలు వెంటనే నాటించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిస్ట్రిక్ట్​ ఫారెస్ట్​ ఆఫీసర్​ సునీల్, నేషనల్ హైవే అథారిటీ పీడీ సీఎస్.రావు, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హిమచందన  ఉన్నారు. 

జీవో 69 ఉపసంహరించుకోవాలి

ధర్పల్లి/పిట్లం, వెలుగు: వడ్రంగి వృత్తికి ఆంక్షలు పెడుతున్న అటవీ శాఖ జీవో 69ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విశ్వబ్రహ్మణ సంఘం స భ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వడ్లూరి రమేశ్, రాము, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.  పిట్లంలో కూడా విశ్వబ్రహ్మణులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ వడ్ల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు పాల్గొన్నారు.

పే స్కేల్ అమలు చేయాలని భిక్షాటన

తాడ్వాయి, వెలుగు: వీఆర్ఏలందరికీ పే స్కేలు అమలు చేయాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏలు చేస్తున్న సమ్మె 32 రోజుకు చేరింది. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలో భిక్షాటన చేస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏ ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వెంటనే డిమాండ్లు నెరవేర్చాలి.. అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరేర్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  కార్యక్రమంలో వీఆర్ఏలు స్వామి, భిక్షపతి, సిద్ధిరాములు, లింగం, బాలరాజ్, రవి పాల్గొన్నారు. 

జాడి జామాల్​పూర్ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలన

బోధన్, వెలుగు: భారీ వర్షాలతో మండలంలోని జాడిజామాల్​పూర్ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టును ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్ఈ బద్రినారాయణ  గురువారం పరిశీలించారు. కొత్త లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ వీరాస్వామి, ఐడీసీ ఈఈ భీమానాయక్, ఏఈ శ్రీనివాస్, రైతు బంధు మాజీ మండల  కోఆర్డినేటర్​బుద్దె రాజేశ్వర్, మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ నర్సయ్య ఉన్నారు.   
ఇంజక్షన్ వికటించి బాలుడు చనిపోయాడని..హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు బంధువుల ధర్నా

భీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గవర్నమెంట్ ఆస్పత్రిలో వేసిన ఇంజక్షన్​ వికటించి తమ నాలుగు నెలల బాబు కార్తీక్​ మృతి చెందాడని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట గురువారం ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని లింబాద్రి గుట్టకు చెందిన వేముల రమ్య తన నాలుగు నెలల కుమారుడుకి ఈ నెల 24న బాబాపూర్ సబ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐపీవీ ఇంజక్షన్ రెండో డోస్ వేయించింది. ఇంజక్షన్ ఇప్పించిన మరుసటి రోజు ఉదయం కార్తీక్​చనిపోయాడు. ఇంజక్షన్ వికటించడం వల్లే బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం నిజామాబాద్ తరలించినట్లు ఎస్సై రాజ్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

పిట్లం, వెలుగు: బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పిట్లం మండలం బొల్లక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వద్ద జరిగింది. ఎస్సై రంజిత్​ తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం వాజీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన పిండికుడ సాయాగౌడ్ (37) బుధవారం రాత్రి బాన్సువాడ నుంచి బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వాజీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్తుండగా బొల్లక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వద్ద రాగానే అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.