కన్నతల్లినే నరికి చంపేసిండు.. న్యూజెర్సీలో దారుణం

కన్నతల్లినే నరికి చంపేసిండు.. న్యూజెర్సీలో దారుణం
  • కొడుకు జెఫ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు

న్యూజెర్సీ: ఓ వ్యక్తి తన 74 ఏండ్ల కన్నతల్లినే దారుణంగా చంపేశాడు. కత్తితో ఆమె తలను వేరు చేశాడు. ఆపై అతడే పోలీసులకు కాల్ చేసి తల్లి అలెగ్జాండ్రియాను చంపేసినట్లు వెల్లడించాడు. తనకు బైపోలార్ డిజార్డర్ ఉందని, తల్లిని చంపినందుకు బాధపడుతున్నానని పేర్కొన్నాడు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఓషన్ సిటీలో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసులు నిందితుడు జెఫ్రీ సర్జెంట్​ను అరెస్ట్ చేశారు. తాము స్పాట్​కు వెళ్లేసరికి నిందితుడు జెఫ్రీ.. తన తల్లి తల లేని మొండెంపై నగ్నంగా పడుకుని ఉన్నాడని తెలిపారు.

ఆమెను చంపినందుకు జెఫ్రీ పదేపదే క్షమాపణలు చెప్పాడన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను సెకండ్ ఫ్లోర్​లో లాండ్రీ పనులు చేస్తున్నానని నిందితుడి తండ్రి జానైస్ పవర్స్ చెప్పారు. తాను కిందకొచ్చి చూసి షాకయ్యానన్నారు. అలెగ్జాండ్రియా చాలా మంచిదని ఫ్యామిలీలో అందరితోనూ ప్రేమగా ఉంటుందని తెలిపారు. జెఫ్రీ కూడా ఫ్యామిలీమ్యాన్ అని,ఎందుకిలా చేశాడో అర్థంకావట్లేదని అన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి ఇంట్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.