నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 22న ప్రారంభమై మే 5న ముగుస్తుంది.
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్.
మొత్తం పోస్టులు: 59. ( అన్ రిజర్వ్డ్ 27, ఓబీసీ 15, ఎస్సీ 8, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 5),
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. లోహ ఖనిజ గనుల కోసం ఫోర్‌మ్యాన్ సామర్థ్య ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. డిప్లొమా కంటే ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులు కాదు.
గరిష్ట వయోపరిమితి: 50 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 22.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.250. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, డిపార్ట్ మెంట్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 6.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ అసెస్మెంట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.nmdc.co.inను సందర్శించండి.

