హైదరాబాద్: మైనింగ్ కంపెనీ ఎన్‌ఎండీసీ ఈ నెల 15న తన 68వ ఫౌండేషన్ డేని ఘనంగా జరుపుకుంది. 1958లో ప్రారంభమైన ఈ సంస్థ, నేడు దేశంలోనే అతిపెద్ద ఇనుము ఖనిజ ఉత్పత్తిదారుగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మైనింగ్ కంపెనీగా ఎదిగింది.
ఈ వేడుకలో సీఎండీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఇండివిడ్యువల్, గ్రూప్ రెండు కేటగిరీలలో ఖనిజ రత్న ఎన్‌ఎండీసీ రత్న అవార్డులను ఇచ్చారు.
సీఎండీ షీల్డ్ , బెస్ట్ ప్రాజెక్ట్ వంటి విభాగాల్లో కూడా అవార్డులు అందజేశారు. బెస్ట్ ఎంప్లాయీస్‌కు 2023 నుంచి కంపెనీ అవార్డులు అందిస్తోంది. వికసిత భారత్ @2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తామని కంపెనీ ఎండీ అమితావ ముఖర్జీ అన్నారు.
