
- ఉద్యోగుల వయో పరిమితిపై వస్తున్న వార్తలు అవాస్తవం
- ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటం: ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసు అంటూ వివిధ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ సర్క్యులేషన్ లేదని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఊహాజనిత వార్తలు రాయడం, సోషల్ మీడియాలో ప్రసారం చేయడం సరికాదని పేర్కొంది. అలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే/ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.