
ఈ సారి సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిర్వహించుకోవాలన్న సందిగ్ధత నెలకొంది. 8వ రోజున జరుపుకోవాలా... లేదా 9వ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలా అన్నది అయోమయంగా మారింది. ఏటా ఎంగిలి పువ్వు బతుకుమ్మతో మొదలై.. 9వ రోజు సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది. ఈసారి రెండు తిథులు ఒకే రోజు వస్తుండడంతో.. 8వ రోజు అష్టమి వస్తోంది. ఇదే ఇప్పుడు సద్దుల బతుకమ్మ ఒకరోజు ముందే జరుపుకోవాలా.. లేదా అన్న టెన్షన్ జనాన్ని వెంటాడుతోంది.