రూ. 3500 కోట్ల ఐటీ నోటీసులు.. కాంగ్రెస్ కు బిగ్ రిలీఫ్

రూ. 3500 కోట్ల ఐటీ నోటీసులు.. కాంగ్రెస్ కు బిగ్ రిలీఫ్

కాంగ్రెస్ కు భారీ ఊరట లభించింది. కాంగ్రెస్‌కు రూ.3500 కోట్ల పన్ను నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సొమ్ము రికవరీపై తాము ఎలాంటి చర్యలు చేపట్టమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఎన్నికల వేళ తాము ఏ పార్టీకి ఆటంకాలు కలిగించాలని అనుకోవట్లేదని తెలిపింది. 

రూ. 3500 కోట్ల పన్ను డిమాండ్ కు సంబంధించి కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్  వేసింది. ఇవాళ పిటిషన్ పై  సుప్రీం విచారణ జరిపింది. ఈ సందర్భంగా  ఐటీ శాఖ తరపు  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ  వాదనలు వినిపించారు. పస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున  కాంగ్రెస్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఐటీ శాఖ తరపు న్యాయవాది  తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం జులై 24 కు వాయిదా వేసింది.