జగిత్యాల బల్దియా వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం

జగిత్యాల బల్దియా వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం
  •     మెజార్టీ ఉన్నా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు తప్పని అవిశ్వాస సెగ
  •     ఫిబ్రవరి 14న అవిశ్వాస సమావేశం 
  •      వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ను గద్దె దింపితే ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగానైనా కొనసాగొచ్చని ప్లాన్​
  •     క్యాంప్ రాజకీయాలకు సిద్ధమవుతున్న ఆశావహులు

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల మున్సిపాలిటీలో మెజార్టీ ఉన్నా బీఆర్ఎస్  పార్టీకి అవిశ్వాస సెగ తప్పడం లేదు. బల్దియా వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌పై గోలి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ మెజార్టీ కౌన్సిలర్లు ఈ నెల 16న అధికారులకు లెటర్​ ​అందజేశారు. దీంతో కలెక్టర్​ శనివారం అవిశ్వాస నోటీస్​ ఇచ్చి, ఫిబ్రవరి 14న జరిగే మీటింగ్‌‌‌‌‌‌‌‌కు హాజరుకావాలని సూచించారు. కాగా పార్టీకి పూర్తిస్థాయి బలం ఉన్నా కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడం జిల్లాలో హాట్‌‌‌‌‌‌‌‌ టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారింది.  

ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలపై కౌన్సిలర్ల అసంతృప్తి 

జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఉన్న బోగ శ్రావణి గతేడాది పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ ​గోలి శ్రీనివాస్.. ఇన్​చార్జి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా​ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీసీ మహిళకు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌  పదవి రిజర్వ్‌‌‌‌‌‌‌‌ కాగా ప్రస్తుత కౌన్సిలర్లలో ముగ్గురు బీసీ మహిళలు ఉన్నారు. గోలి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌పై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు బీసీ మహిళ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​పదవిని ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనుభవించడంపై మెజార్టీ కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ను నియమిస్తామని హైకమాండ్​ స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోవడంతో మిన్నకుండిపోయింది. అనంతరం పరిణామాల్లోనూ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ను ఎన్నుకోవాలని పలువురు కౌన్సిలర్లు హైకమాండ్​  దృష్టికి  తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. మరోవైపు 2018 మున్సిపల్​యాక్ట్​ప్రకారం.. చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ రాజీనామా చేస్తే వైస్​చైర్మన్‌‌‌‌‌‌‌‌/చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా కొనసాగొచ్చు.  

ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి చైర్మన్​ మీద అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌పై నోటీస్​ఇచ్చినట్లు తెలుస్తోంది. కనీసం వైస్​చైర్మన్‌‌‌‌‌‌‌‌ను​ గద్దె దింపితే ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగానైనా  కొనసాగొచ్చని ఆశావహులు ప్లాన్ ​చేసుకుంటున్నారు. ఈక్రమంలో కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి అవిశ్వాస పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈక్రమంలో మరో ఏడాది పదవీకాలం ఉండడం.. పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టత లేకపోవడంతోనే తాజాగా అవిశ్వాసం తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఫిబ్రవరి14న అవిశ్వాస సమావేశం

పాలన సాగేందుకు ఏడాది కింద వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు ఆఫీసర్లు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలను అప్పగించారు. చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ఆశావహులు, కౌన్సిలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో తనకు అప్పగించిన బాధ్యతలు తొలగించి, తిరిగి వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గానే కొనసాగించాలని ఇటీవల గోలి శ్రీనివాస్ జిల్లా ఆఫీసర్లను కలిసి విన్నవించారు.

అయినా వారి నుంచి స్పందన రాలేదు. దీంతో ఇక చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ఎన్నిక  ప్రక్రియ జరగదని గ్రహించిన ఆశావహులు పలువురు కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాసానికి తెర లేపారు. ఈ అవిశ్వాసం నెగ్గితే వైస్ చైర్ పర్సన్ పదవి దక్కించుకొని రూల్ ప్రకారం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి చైర్ పర్సన్​గా కొనసాగవచ్చని ఆశావహులు ప్లాన్​ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆశావహులు క్యాంప్ రాజకీయాలకు తెరలేపేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఒక్కో కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.1లక్ష నుంచి  2 లక్షల వరకు ఇచ్చేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది.

ఉన్నతాధికారులదే తుది నిర్ణయం

జగిత్యాల బల్దియా కౌన్సిలర్ల అవిశ్వాస అంశంపై ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులదే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. 

_ అనిల్ బాబు, జగిత్యాల కమిషనర్​