సీఎం ఇలాకాలో తప్పని అవిశ్వాస తీర్మానం

సీఎం ఇలాకాలో తప్పని అవిశ్వాస తీర్మానం

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్ల అసమ్మతి తప్పలేదు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి గుప్తపై  14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు.  అవిశ్వాస  తీర్మాన నోటిసును జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందజేశారు.రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే మున్సిపాలిటీల్లో అవిశ్వాస ప్రక్రియను నాలుగేళ్ల గడువుకు పెంచాలని గతంలో ప్రభుత్వం ఒక ప్రతిపాదన తెచ్చింది. ఈ బిల్లుపై అధికారిక ఆమోదం లేకపోవడంతో మూడేళ్ల గడువునే పరిగణనలోకి తీసుకుంటున్నారు.