మధ్యప్రదేశ్‌‌‌‌లో అవిశ్వాస తీర్మానం

మధ్యప్రదేశ్‌‌‌‌లో అవిశ్వాస తీర్మానం

16న ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌

మధ్యప్రదేశ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌ను కోరనున్న బీజేపీ

భోపాల్‌‌‌‌: మధ్యప్రదేశ్‌‌‌‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి పూర్తి మెజారిటీ లేనందున ఈ నెల 16న ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌ నిర్వహించాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌ను కోరుతామని బీజేపీ చీఫ్‌‌‌‌ విప్‌‌‌‌ నరోత్తమ మిశ్రా చెప్పారు. ఈ విషయమై గవర్నర్‌‌‌‌‌‌‌‌ను కలుస్తామని అన్నారు. “ కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. అందుకే బడ్జెట్‌‌‌‌ సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజు (ఈ నెల 16)న ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌ పెట్టాలని అడుగుతాం” అని మిశ్రా అన్నారు. కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ ప్రభుత్వానికి మెజారిటీ లేదని ఎంపీ మాజీ సీఎం శివరాజ్‌‌‌‌సింగ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ అన్నారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, తమ పార్టీకి చెందిన 114 మంది ఎమ్మెల్యేలతో కలిసి 15 నెలల కిందట కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడంతో ఆయన మద్దతుదారులు 22 మంది ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది.

For More News..

కరోనా ఫ్రీ సర్టిఫికెట్​ తెస్తేనే జర్నీకి పర్మిషన్

ఇండియాలో కరోనా తొలి మరణం

అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన