టోక్యోలో ఇతర స్టేడియాలకు కూడా ఫ్యాన్స్‌‌‌‌కు నో ఎంట్రీ

టోక్యోలో ఇతర స్టేడియాలకు కూడా ఫ్యాన్స్‌‌‌‌కు నో ఎంట్రీ
  • ఇతర వేదికల్లో కూడా ఫ్యాన్స్‌‌‌‌కు నో ఎంట్రీ
  • టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ ఆర్గనైజర్స్‌‌‌‌ కీలక నిర్ణయం

టోక్యో: జపాన్‌‌‌‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఒలింపిక్స్‌‌‌‌ ఆర్గనైజింగ్‌‌‌‌ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యోతో పాటు దాని చుట్టుపక్కల గేమ్స్‌‌‌‌కు ఆతిథ్యమిచ్చే మరో రెండు వేదికలకు కూడా ఫ్యాన్స్‌‌‌‌ను అనుమతించడం లేదు. బేస్‌‌‌‌బాల్‌‌‌‌, సాఫ్ట్‌‌‌‌బాల్‌‌‌‌కు ఆతిథ్యమిచ్చే ఫుక్సుషిమా, సాకర్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ను నిర్వహించే హోక్కైడో ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఈ రెండు ప్లేస్‌‌‌‌ల్లోకి ఫ్యాన్స్‌‌‌‌కు ఎంట్రీ లేకుండా చేస్తే మెజారిటీ ఒలింపిక్స్‌‌‌‌ వెన్యూస్‌‌‌‌లో ఇన్ఫెక్షన్‌‌‌‌ను కట్టడి చేయొచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ‘పిల్లలతో సహా చాలా మంది గేమ్స్‌‌‌‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి వారికి ఆ చాన్స్‌‌‌‌ లేదు. బేస్‌‌‌‌బాల్‌‌‌‌, సాఫ్ట్‌‌‌‌బాల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని డిసైడ్‌‌‌‌ అయ్యాం. నిర్ణయం కఠినమైనదే అయినా తప్పలేదు’ అని ఫుక్సుషిమా గవర్నర్‌‌‌‌ మసావో యుచిబోరి వెల్లడించాడు. మరోవైపు ఒలింపిక్స్‌‌‌‌ను రద్దు చేయాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐవోసీ ప్రెసిడెంట్‌‌‌‌ థామస్‌‌‌‌ బాచ్‌‌‌‌ బస చేసిన ఫైవ్‌‌‌‌ స్టార్‌‌‌‌ హోటల్‌‌‌‌ ముందు 40 మంది నిరసనకారులు శనివారం ధర్నాకు దిగారు.