టోక్యో హనేడా ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

టోక్యో హనేడా ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

టోక్యో: జపాన్‌‌లోని టోక్యో హనేడా ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ లో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. శనివారం ఉదయం 11కు రన్‌‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. టేకాఫ్‌‌కు సిద్ధంగా ఉన్న ఇవా ఎయిర్‌‌‌‌ విమానాన్ని థాయ్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ ఫ్లైట్‌‌ వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘటనలో రెండు ఫ్లైట్ల వింగ్స్‌‌ దెబ్బతిన్నాయి. దీంతో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ను టెంపరరీగా క్లోజ్‌‌ చేసి, శకలాలను తొలగించారు. ప్రమాదం జరిగినప్పుడు ఇవా ఫ్లైట్‌‌లో సిబ్బందితో సహా 207 మంది, థాయ్‌‌ ఫ్లైట్ లో 264 మంది  ఉన్నారని అధికారులు తెలిపారు.  శకలాలు తొలగించేంత వరకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయన్నారు