కేసు బుక్కయినా పర్లేదు.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కాంగ్రెస్ నేత

కేసు బుక్కయినా పర్లేదు.. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కాంగ్రెస్ నేత

బెంగాల్ ముర్షిదాబాద్‌లోని బెర్హంపూర్ సమీపంలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు భయపడకుండా.. పోలీసులు తనపై జరిమానా విధించినా పర్వాలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉందని, ఎవరూ లేరని కూడా ఆయన చెప్పారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పోలీసులు నాకు శిక్ష వేసినా ప్రాబ్లెమ్ లేదు. కానీ నేను బైక్ నడుపుతున్న ప్రదేశంలో ఎవరూ లేరు. ఆ స్థలంతో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నేను చాలా కాలం తర్వాత రైడ్ చేశాను" అని చౌదరి చెప్పారు. ఈ వైరల్ వీడియోలో, కాంగ్రెస్ నాయకుడు తన బైక్‌పై మరో వ్యక్తి కూడా ఉండగా.. చౌదరి ఫుల్ స్పీడ్‌లో బైక్‌ను నడుపుతూ కనిపించారు. ముర్షిదాబాద్‌లో రైడ్ చేస్తోన్న అతనితో పాటు పదుల సంఖ్యలో బైకర్లు కూడా ఉన్నారు. వారు చౌదరి ఫీట్ ను ఆసక్తిగా చూస్తూ.. తమ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీయడం ఈ వీడియోలో చూడవచ్చు.