30 సెకన్ల పాటు మాస్క్ తీయాల్సిందే.. మధ్యప్రదేశ్‌లో కొత్త రూల్

30 సెకన్ల పాటు మాస్క్ తీయాల్సిందే.. మధ్యప్రదేశ్‌లో కొత్త రూల్

భోపాల్:  కరోనా నుంచి రక్షణగా తప్పకుండా మాస్క్ కట్టుకోవాలనే నిబంధన దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే మాస్కుల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. బ్యాంకులు, బంగారు దుకాణాల లాంటి పబ్లిక్ ప్లేసెస్‌కు వెళ్లే టైమ్‌లో విజిటర్స్‌ 30 సెకన్లపాటు తమ మాస్కులు తీసి ఫేస్ చూయించాలని కొత్త రూల్‌ తీసుకొచ్చింది. దీని వల్ల బ్యాంకులు, జ్యువెల్లరీ షాప్స్‌కు వెళ్లే విజిటర్స్‌ను సీసీటీవీల్లో ఫొటోగ్రాఫ్‌ తీసుకుంటారు. అన్ని ఏరియాల్లో సెక్యూరిటీని పటిష్టం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల క్రైమ్ రేటు తగ్గుతుందని, మాస్కులతో బ్యాంకుల్లో ప్రవేశిస్తే వారిని గుర్తించడం కష్టమని ఓ బ్యాంకు కస్టమర్ తెలిపాడు.