ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీ మాత్రమే

V6 Velugu Posted on Jul 14, 2021

కేంద్ర హోం మంత్రి  అమిత్ షాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత అమిత్‌ షాతో భేటీ కావడం ఇదే ఫస్ట్ టైం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ ఢిల్లీ వెళ్లారు. హుజురాబాద్ ఉపఎన్నికలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

అమిత్ షాతో భేటీ తర్వాత ఈటల మాట్లాడారు. అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని తెలిపారు. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తానని చెప్పారన్నారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీ మాత్రమేనని అన్నారు ఈటల రాజేందర్‌.

Tagged etela, spent much money, only BJP win

Latest Videos

Subscribe Now

More News