పెళ్లి కోసం ఇన్ని చేయాలా.. డబ్బు, కారు.. ఏదడిగినా ఇవ్వాల్సిందేనట

పెళ్లి కోసం ఇన్ని చేయాలా.. డబ్బు, కారు.. ఏదడిగినా ఇవ్వాల్సిందేనట

ఇండియన్ వెడ్డింగ్స్ లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో సంప్రదాయం, ఆచారాలుంటాయి. పెళ్లి కుదిరిన దగ్గర్నుంచి.. అప్పగింతలు, రిసెప్షన్, 16రోజుల పండుగ అని రకరకాల పద్దతులుంటాయి. ఇందులో కొందరు తమ తాహతుకు తగ్గట్టు వివాహం జరిపిస్తే.. మరికొందరు మాత్రం చాలా ఆడంబరంగా చేస్తుంటారు. వరుడికి, అతని కుటుంబానికి లాంఛనాల విషయంలో ఏ విషయంలోనూ తక్కువ కాకుండా చూసుకుంటారు. వారు అడిగిన వాటన్నింటికీ సంప్రదాయబద్దంగా సమకూర్చడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఓ చైనాలోని ఓ ప్రాంతంలో మాత్రం అలా కాదు. వధువు బంధువులు, గ్రామస్థులు.. వరుడిని ఏదడిగినా ఇవ్వాల్సిందే. లేదంటే ఆ పెళ్లి జరగడం కూడా కష్టమేనట. వివరాల్లోకి వెళితే..

చైనాలో వధువును తీసుకెళ్లేందుకు వెళ్తున్న వరుడి కారును వందలాది మందికి పైగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం, తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది.  దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వైరల్ క్లిప్ కారును పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన వృద్ధులు, అతని నుంచి డబ్బు, సిగరెట్లు డిమాండ్ చేయడం చూపించింది. ఈ ఫుటేజ్ వివాదాస్పద ప్రధాన భూభాగ వివాహ ఆచారాల గురించి చర్చకు దారితీసింది. అక్కడి సంప్రదాయం ప్రకారం, వరుడి బంధువులు గ్రామస్థులకు వారు అడిగిన వాటిని ఇవ్వాలి. అవి పంచదార లేదా సిగరెట్ నుంచి డబ్బు, ఇతర ఏదైనా కావచ్చు. వాటితో వారు సంతృప్తి చెందకపోతే, వరుడు తన వధువును చూడటానికి నిరాకరించవచ్చు లేదా అతని రాక ఆలస్యం కావచ్చు. ఈ ఆచారాన్ని మాండరిన్‌లో ఇయాన్ మెన్ అని పిలుస్తారు. అంటే రాకను అడ్డుకోవడన్నమాట.

వరుడు.. వధువు పట్ల ఉన్న అంకితభావాన్ని, ఆమెను ఎంతలా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడో చెక్ చేయడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఇందులో భాగంగా వధువు తరపు కొంతమంది బంధువులు వరుడిని చిక్కుల్లో పడేసేలా.. పద్యాలు పఠిస్తారు లేదా అతని గానం, నృత్య నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.

తైజౌలోని వెడ్డింగ్ ప్లానర్ ప్రకారం, వరుడి కుటుంబం సాధారణంగా పెళ్లికి వచ్చిన వారికి పంపిణీ చేయడానికి బహుమతులు, డబ్బును సిద్ధం చేస్తుంది. “అక్కడ చాలా మంది వ్యక్తులు ఉంటే, వరుడి కుటుంబం ప్రతి ఎరుపు ప్యాకెట్‌లో ఒక యువాన్ (14 US సెంట్లు) మాత్రమే ఉంచుతుంది. అంత మంది లేకపోతే రెడ్ ప్యాకెట్‌లో 10 యువాన్లు వేస్తారు’’ అని వెడ్డింగ్ ప్లానర్ చెప్పాడు.

ఈ పెళ్లి ఆచారంపై సోషల్ మీడియా యూజర్స్ పలు రకాలుగా స్పందించారు. కొందర్ని ఇది ఆకట్టుకోకపోగా, మరికొందరు ఆసక్తికరంగా భావించారు. “ఎంత నీచమైన ఆచారం. ఇది స్పష్టంగా దోపిడీ” అని కొందరి,“ఈ ఆచారం యువకులను పెళ్లి చేసుకోకుండా చేస్తుంది” అని ఇంకొందరు అన్నారు.

Also Read :- హ్యాపీ బర్త్డే ఐష్.. తరగని అందంతో మాజీ మిస్