మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్ అవసరం లేదు.. లిస్ట్ నుంచి తొలగింపు

 మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్ అవసరం లేదు.. లిస్ట్ నుంచి తొలగింపు

ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టిన తేదీని ధృవీకరించేందుకు ఆధార్‌ నంబర్‌ ను స్వీకరించమని తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఆధార్ ఉపయోగించి పుట్టిన తేదీని మార్చలేమని చెప్పింది. ఆధార్ ను చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి తీసివేస్తున్నట్లు పేర్కొంది.  దీనికి బదులుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పొందిన మార్క్‌షీట్, స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్స్  ఉపయోగించవచ్చని సూచించింది.

వివిధ న్యాయస్థానాలు ఆధార్ చట్టం 2016పై అనేకసార్లు తమ అభిప్రాయాలు తెలపాయి.  ఇటీవల ముంబై హైకోర్టు కూడా  ఆధార్ నంబర్‌ను గుర్తింపు కార్డుగా ఉపయోగించాలని, జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదని చెప్పింది. దీని తరువాత యూఐడీఏఐ డిసెంబర్ 22, 2023 న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ తెలిపింది.

  ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డ్ అని ఇది భారత ప్రభుత్వంచే జారీ చేస్తుందని తెలిపింది. ఇది  దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుందని చెప్పింది. అయితే ఆధార్‌ను తయారు చేసే సమయంలో వారి వివిధ పత్రాల ప్రకారం పుట్టిన తేదీని నమోదు చేశారని కాబట్టి ఇది జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించరాదని తెలిపింది.