పెళ్లిలో పన్నీరు లేదని.. పచ్చడి పచ్చడిగా కొట్టుకున్నారు

పెళ్లిలో పన్నీరు లేదని.. పచ్చడి పచ్చడిగా కొట్టుకున్నారు

ఇండియన్ వెడ్డింగ్స్ అంటేనే చాలా కాస్ట్లీ. రకరకాల ఫుడ్ మెనూ, డెకరేషన్ వంటి వాటి కోసం ఇక్కడి జనం బాగానే ఖర్చు చేస్తుంటారనడంలో సందేహమేం లేదు. నాన్ వెజ్ లో చికెన్, మటన్, రొయ్యలు, చేపలు.. ఇలా చాలా రకాలున్నాయి. మరి వెజ్ విషయానికొస్తే.. చాలా మంది శాఖాహార ప్రియులు ఇష్టపడే ఐటెమ్ పన్నీర్. అయితే ఈ ఫుడ్ విషయంలో కొన్ని సందర్భాల్లో ఫంక్షన్లు, పార్టీల్లో గొడవలు జరగడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో విందులో పన్నీర్ లేదంటూ అతిథులు గొడవకు దిగడానికి సంబంధించిన ఓ వీడియే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ క్లిప్ లో కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం కనిపిస్తుంది. కేవలం విందులో పన్నీర్ లేదన్న కారణంతో సంతోషకరమైన క్షణాలను వీరంతా కలిసి గొడవగా మార్చేసి, ఆందోళన సృష్టించారు. ఇక ఈ క్లిప్ పై నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పన్నీర్ కోసం మూడో ప్రపంచ యుద్దం జరుగుతున్నట్టుందని కొందరు, మరికొందరేమో ఎంతో హ్యాపీగా ఉండాల్సిన సమయంలో ఇలా గొడవకు దిగుతారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.