కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో కూలిన పీవీపీ పైకప్పు

కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో కూలిన పీవీపీ పైకప్పు

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో అడిషనల్​ బెడ్స్​వేసిన షెడ్​లోని పీవీపీ పైకప్పు వర్షానికి తడిసి గురువారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా కూలింది. ఆ ఏరియాలో పేషెంట్లెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హాస్పిటల్​లోని ఫస్ట్​ ఫ్లోర్​లో అడిషనల్​ బెడ్స్​ కోసం రెండేండ్ల కింద ఈ షెడ్​నిర్మించారు. పై కప్పు పీవీపీ చేయించారు. దీన్ని పోస్ట్​ఆపరేషన్​ వార్డుగా వినియోగిస్తున్నారు. 4 రోజులు నుంచి కంటిన్యూగా వర్షాలు కురుస్తుండడంతో షెడ్​పైన నీళ్లు పడి పీవీపీ తడిసింది. ఆకస్మాత్తుగా పీవీపీ కప్పు  కూలింది.

3అక్కడున్న స్టాప్​వెంటనే షెడ్​లో ఉన్న డెలీవరి పేషెంట్లను మరో వార్డుకు మార్చారు.  త్రటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోస్ట్​ఆపరేషన్​వార్డులో కూలిన పీవీపీ పైకప్పును బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి  ఆధ్వర్యంలో ఆ పార్టీ లీడర్లు పరిశీలించారు. హాస్పిటల్​ఆవరణలో పలు చోట్ల పెచ్చులూడుతున్నాయని, వానకు వరండాలో నీళ్లు చేరుతున్నాయన్నారు.  సమస్యలు పరిష్కరించి, పేషెంట్లకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆఫీసర్లకు విన్నవించారు.