బీచ్ లో ఆ పనిపై నిషేధం.. నెదర్లాండ్ కీలక నిర్ణయం

బీచ్ లో ఆ పనిపై నిషేధం.. నెదర్లాండ్ కీలక నిర్ణయం

నెదర్లాండ్ లోని ఓ పట్టణంలోని బీచ్‌లో జంటలు బహిరంగంగా లైంగిక చర్యలో పాల్గొనడం, నగ్నంగా బాత్ చేయడాన్ని నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ బీచ్‌ లో లైంగిక కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. బీచ్ లో బహిరంగ లైంగిక చర్యలపై ప్రభుత్వానికి, వాటర్ బోర్డుకు ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

బహిరంగ లైంగిక చర్యలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈ సందర్భంగా పట్టణ మేయర్ ఫ్రెడరిక్ షౌవెనార్ చెప్పారు. ఇందులో భాగంగా బీచ్ లో 8 చోట్ల సందర్శకుల కోసం సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు. నెదర్లాండ్ లో చాలామంది వ్యక్తులు లైంగిక చర్యల్లో సంప్రదాయిక వైఖరి అవలంభించాలని కోరారు.