కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 

చండూరు, వెలుగు : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చండూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో బుధవారం కూల్చిన బిల్డింగ్ తోపాటు, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి పార్టీ శ్రేణులతో కలిసి చౌరస్తాలో నిరసన తెలిపారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీపీ భవనాన్ని కూల్చడం  రాజకీయ కక్షేనని,.అధికార పార్టీ ఎమ్మెల్యేకు అధికారులు ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు.  తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సహకారంతో రూ.50 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై 18 నెలలు కావస్తున్నా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉన్న నిధులను సద్వినియోగం చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు పెద్దింటి బుచ్చిరెడ్డి, కర్నాటి వెంకటేశం, బీఆర్ఎస్ కార్మిక విభాగం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి, చండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, బొడ్డు సతీష్, పెద్దగోని వెంకన్న, కురుపాటి సుదర్శన్, తేలుకుంట్ల చంద్రశేఖర్, జానయ్య పాల్గొన్నారు.